పత్రికా ప్రకటన
గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్, 1) కిన్నెరసాని (బాలురు), బి.డి కొత్తగూడెం జిల్లా, 2) కాచనపల్లి (బాలికలు), బి.డి కొత్తగూడెం జిల్లా మరియు 3) కొత్తగూడ (బాలురు), మహబూబాబాద్ లో ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా స్పోర్ట్స్ కోచ్ లు గా పనిచేయడానికి 2022-23 సంవత్సరానికిగాను కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ లలో (1) సంవత్సరం NS NIS డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరనైనది (సర్టిఫికేట్ కోర్సుపూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయుటకు అనర్హులు).
కావున, ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తమ రెజ్యూమెతో పాటు sportsofficertwd@gmail.com మెయిల్ నకు లేదా అకడమిక్ సెల్, కమిషనర్ కార్యాలయము, గిరిజన సంక్షేమ శాఖ, DSS భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ నందు సమర్పించగలరు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 30.1.2023 సాయంత్రం 5.00 గంటల వరకు.
పూర్తి వివరాల కోసం సంప్రదించ వలసిన సెల్.నం. 9908550250, 9247267050 (అన్ని పని దినాలలో ఉ. 10:30 నుండి సా. 5:00 వరకు మాత్రమే సంప్రదించగలరు).
VIDEO: https://youtu.be/4QcNCFH1cVE
No comments:
Post a Comment